ఇండస్ట్రీ ఏ ఒక్క ఫ్యామిలీ సొత్తు కాదు

ABN , Publish Date - Aug 07 , 2024 | 01:04 AM

‘వీళ్లు తప్ప మరేవరూ ఉండరు’ అంటూ మెగా ఫ్యామిలీపై చేస్తున్న విమర్శలపై నటుడు నాగబాబు స్పందించారు. సోమవారం ‘కమిటీ కుర్రోళు’్ల సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు విచ్చేసిన...

‘వీళ్లు తప్ప మరేవరూ ఉండరు’ అంటూ మెగా ఫ్యామిలీపై చేస్తున్న విమర్శలపై నటుడు నాగబాబు స్పందించారు. సోమవారం ‘కమిటీ కుర్రోళు’్ల సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ట్రీలో ఎటు చూసినా మెగా ఫ్యామిలీదే అధిపత్యం.. కొందరి ఎదుగుదలను ఆ ఫ్యామిలీ అడ్డుకుంటోందని అని ఎంతో మంది సార్లు అనడం విన్నాను. అలా అనడం ముమ్మాటికీ తప్పు. మాకు అలాంటి ఫీలింగ్‌ లేదు. ఇండస్ట్రీ మా తాత సొత్తు కాదు.. మా నాన్న సామ్రాజ్యం కాదు. అలాగే నందమూరి ఫ్యామిలీది కాదు, అక్కినేని కుటుంబానిది కాదు. ఇండస్ట్రీ అందరికీ చెందినది. సినిమా కుటుంబ నేపథ్యం ఏమీ లేకపోయినా అడవి శేష్‌ వంటి హీరోలు తమ టాలెంట్‌తోనే పైకి వచ్చారు. వారికి ఎవరూ అడ్డం పడలేదుగా.


ఇప్పుడు ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంలో నటిస్తున్న వాళ్లు ఏ రేంజ్‌కి వెళతారో ఎవరన్నా ఊహించగలరా! ఈ రోజు సినిమాలే కాదు.. ఆర్టిస్టుల కోసం ఎన్నో ఓటీటీ వేదికలు ఉన్నాయి. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాకి ట్రై చేయండి. రెగ్యులర్‌ సినిమాల్లో రొటీన్‌ క్యారెక్టర్స్‌ కోసం ప్రయత్నించకండి’’ అని చెప్పారు.

Updated Date - Aug 07 , 2024 | 01:04 AM