సిరిమల్లె చెట్టు లాంటి చిత్రం

ABN , Publish Date - Sep 25 , 2024 | 01:16 AM

‘దేవర’ వార్‌ఫైర్‌ లాంటి సినిమా అయితే ‘సత్యం సుందరం’ సిరిమల్లె చెట్టు లాంటి అందమైన చిత్రం. ఈ రెండింటినీ తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి’ అని హీరో కార్తి కోరారు. ఆయన కథానాయకుడిగా...

‘దేవర’ వార్‌ఫైర్‌ లాంటి సినిమా అయితే ‘సత్యం సుందరం’ సిరిమల్లె చెట్టు లాంటి అందమైన చిత్రం. ఈ రెండింటినీ తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి’ అని హీరో కార్తి కోరారు. ఆయన కథానాయకుడిగా ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ ‘‘అన్నయ్య సూర్యకూ ఈ కథ చాలా నచ్చింది. అరవింద్‌స్వామి కొత్తగా కనిపిస్తారు’ అని హీరో కార్తి అన్నారు. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి జీవితాలకు దగ్గరగా ఉండే చిత్రమిది. ‘96’ చిత్రం లానే ఇది మీ మనసును చూరగొంటుంది’ అన్నారు.

Updated Date - Sep 25 , 2024 | 01:16 AM