హీరోయిన్‌ గుర్రపు స్వారీ

ABN , Publish Date - Feb 12 , 2024 | 05:32 AM

నిఖిల్‌ తన 20వ చిత్రం ‘స్వయంభూ’లో లెజెండరీ యోధుడి పాత్ర పోషిస్తున్నారు. అద్భుతమైన వార్‌ సీన్లు ఉండే ఈ సినిమా కోసం ఆయన మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు...

హీరోయిన్‌ గుర్రపు స్వారీ

నిఖిల్‌ తన 20వ చిత్రం ‘స్వయంభూ’లో లెజెండరీ యోధుడి పాత్ర పోషిస్తున్నారు. అద్భుతమైన వార్‌ సీన్లు ఉండే ఈ సినిమా కోసం ఆయన మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్త నటిస్తున్నారు. కొన్ని యాక్షన్‌ దృశ్యాల్లో తను పాల్గొనడం కోసం ప్రస్తుతం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు సంయుక్త. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీ అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్‌ జరుగుతోంది. నిఖిల్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రాఫర్‌. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 05:32 AM