హీరోగా అలీ సోదరుడి కుమారుడు

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:43 AM

ప్రముఖ హాస్యనటుడు అలీ సోదరుడి కుమారుడు సదన్‌ ‘ప్రణయ గోదారి’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌. పి.ఎల్‌.విఘ్నేశ్‌ దర్శకత్వంలో...

హీరోగా అలీ సోదరుడి కుమారుడు

ప్రముఖ హాస్యనటుడు అలీ సోదరుడి కుమారుడు సదన్‌ ‘ప్రణయ గోదారి’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌. పి.ఎల్‌.విఘ్నేశ్‌ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ ను అంబర్‌పేట్‌ శంకర్‌ ఆవిష్కరించారు. చిన్న సినిమాలకు పరిశ్రమలో అందరూ అండగా నిలవాలనీ, ‘ప్రణయ గోదారి’ మంచి విజయం సాధించాలనీ ఆయన కోరారు. ‘నాకు ఎంతో ఇష్టమైన శంకరన్న ఈ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’ అని చెప్పారు నిర్మాత లింగయ్య. సాయికుమార్‌, పృథ్వీ, జబర్దస్త్‌ రాజమౌళి, సునీల్‌ రావినూతల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, ఫొటోగ్రఫీ: ఈదర ప్రసాద్‌.

Updated Date - Jun 13 , 2024 | 04:43 AM