బరిలో దిగాడు గెలిచే కుర్రాడు

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:57 AM

రాకేశ్‌ వర్రె టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘జితేందర్‌రెడ్డి’. 1980ల్లో జరిగిన సంఘటన ఆధారంగా దర్శకుడు విరించి వర్మ తెరకెక్కిస్తున్నారు. ముదుగంటి రవీందర్‌రెడ్డి నిర్మాత...

బరిలో దిగాడు గెలిచే కుర్రాడు

రాకేశ్‌ వర్రె టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘జితేందర్‌రెడ్డి’. 1980ల్లో జరిగిన సంఘటన ఆధారంగా దర్శకుడు విరించి వర్మ తెరకెక్కిస్తున్నారు. ముదుగంటి రవీందర్‌రెడ్డి నిర్మాత. చిత్రబృందం ఈ సినిమా నుంచి ‘బరిలో దిగాడు గెలిచే కుర్రాడు’ అంటూ సాగే యూత్‌ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ‘కాలేజ్‌ స్టూడెంట్‌ లీడర్‌ జితేందర్‌ రెడ్డి కథ ఇది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఆయన ఎదుర్కొన్న తీరును ఇందులో ఆవిష్కరిస్తున్నాం’ అని యూనిట్‌ తెలిపింది.

Updated Date - Apr 15 , 2024 | 12:57 AM