కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫిబ్రవరిలో ఆట మొదలు

ABN, Publish Date - Jan 05 , 2024 | 06:58 AM

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదలచేస్తున్నట్లు నిర్మాత తెలిపారు...

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదలచేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గీతానంద్‌ ఈ చిత్రంతో హీరోగా మరో మెట్టు ఎక్కుతాడనే నమ్మకం ఉంది. నేహా సోలంకి తన అభినయంతో ఆకట్టుకుంటుంది. దయానంద్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. విభిన్నమైన కథతో తెరకెక్కిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. తన జీవితాన్ని చాలించాలనుకున్న ఓ వ్యక్తి రియల్‌టైమ్‌ సైకలాజికల్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయనేది ఆసక్తికరంగా ఉంటుంద’న్నారు. మధుబాల కీలకపాత్ర పోషించిన ఈ చిత్రానికి అభిషేక్‌ ఏ ఆర్‌ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: అరవింద విశ్వనాథన్‌.

Updated Date - Jan 05 , 2024 | 06:58 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!