గేమ్‌ ఆన్‌ రియలిస్టిక్‌గా ఉంటుంది

ABN , Publish Date - Jan 29 , 2024 | 06:18 AM

‘చనిపోదాం అనుకొనే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్‌ ప్రవేశించడం వల్ల అతడి జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? అనే పాయింట్‌తో ‘గేమ్‌ ఆన్‌’ చిత్రాన్ని రూపొందించాం...

గేమ్‌ ఆన్‌ రియలిస్టిక్‌గా ఉంటుంది

‘చనిపోదాం అనుకొనే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్‌ ప్రవేశించడం వల్ల అతడి జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? అనే పాయింట్‌తో ‘గేమ్‌ ఆన్‌’ చిత్రాన్ని రూపొందించాం. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలా కాకుండా డిఫరెంట్‌గా ప్రయత్నించాం. యూత్‌ను ఎట్రాక్ట్‌ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలిగి ఉంటుందీ చిత్రం’ అన్నారు దర్శకుడు దయానంద్‌. గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. రవి కస్తూరి నిర్మాత. సినిమా చాలా రియలిస్టిక్‌గా సాగుతుందనీ, ప్రతి ఒక్కరూ చూడాలనీ దయానంద్‌ కోరారు.

Updated Date - Jan 29 , 2024 | 06:18 AM