గేమ్‌ మొదలైంది

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:55 AM

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. మధుబాల, ఆదిత్య మీనన్‌, శుభలేక సుధాకర కీలకపాత్రలు పోషించారు. దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది...

గేమ్‌ మొదలైంది

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. మధుబాల, ఆదిత్య మీనన్‌, శుభలేక సుధాకర కీలకపాత్రలు పోషించారు. దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘మంచి కథతో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశాం. ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసేలా ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథ తెలుగు తెరపై రాలేదు’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పూరీ జగన్నాథ్‌ అభిమానిగా ఈ సినిమాను డైరెక్ట్‌ చేశాను. ఓ వ్యక్తి రియల్‌టైమ్‌ సైకలాజికల్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. అసలు ఆ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఆసక్తికరంగా ‘గేమ్‌ ఆన్‌’ చిత్రం తెరకెక్కింది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’ అని చెప్పారు. కొత్త తరహా పాత్రను ఈ చిత్రంలో పోషించినట్లు నేహా సోలంకి చెప్పారు. గేమ్‌ స్టార్ట్‌ చేశాం, మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి అని గీతానంద్‌ కోరారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్‌ ఏ ఆర్‌.

Updated Date - Jan 21 , 2024 | 01:55 AM