NKR21: కళ్యాణ్ రామ్ 21వ సినిమా.. ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ విడుదల

ABN , Publish Date - May 28 , 2024 | 04:41 PM

తన తాత విశ్వ విఖ్యాత నట సౌర్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా.. దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో చేస్తున్న తన 21 వ చిత్రం గ్లింప్స్‌ని నందమూరి కళ్యాణ్ రామ్ విడుదల చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్రేమ్’ పేరుతో ఈ గ్లింప్స్ వదిలారు.

NKR21: కళ్యాణ్ రామ్ 21వ సినిమా.. ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ విడుదల
NKR21 Movie The Fist of Flame Pic

తన తాత విశ్వ విఖ్యాత నట సౌర్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి (NT Ramarao Birth Anniversary) సందర్భంగా.. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri)తో చేస్తున్న తన 21 వ చిత్రం గ్లింప్స్‌ని నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) విడుదల చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ పేరుతో వదిలిన గ్లింప్స్.. కళ్యాణ్ రామ్‌ని యాక్షన్-ప్యాక్డ్ గా సరికొత్త గెటప్‌లో ప్రజెంట్ చేసింది.

*NTR Jayanthi: ‘భారతరత్న’.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ వీడియోలో నందమూరి కళ్యాణ్ రామ్ తన పిడికిలిని చూపించడం తన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా వుంటుందో తెలియజేస్తోంది. వీడియోలో మాస్ అవతార్‌లో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నారు. ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ విజువల్స్ గ్రాండ్‌గా వున్నాయి. ఈ గ్లింప్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ వీడియోని నందమూరి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (The Fist of Flame From Kalyan Ram NKR21)


Nkr.jpg

ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించిన విజయశాంతి (Vijayashanthi).. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి సైన్ చేశారు. ఇది ‘కర్తవ్యం’ పాత్ర తరహలో ఆమెకు పవర్ ఫుల్ డైనమిక్ పాత్ర కానుంది. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ‌గా, అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే, తమ్మిరాజు ఎడిటర్. సినిమాకు సంబంధించిన టైటిల్, ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. (NTR Jayanthi Special)

Read Latest Cinema News

Updated Date - May 28 , 2024 | 04:41 PM