మొదటి పార్ట్‌కి ఏమాత్రం తగ్గదు

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:08 AM

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది...

మొదటి పార్ట్‌కి ఏమాత్రం తగ్గదు

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. చిత్రబృందం బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘డీజే టిల్లు’ యువతను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. టిల్లు పాత్రను ప్రేక్షకులు హృదయాల్లో పెట్టుకున్నారు. అందుకే సీక్వెల్‌ అంటే మొదట భయపడ్డాను. ‘టిల్లు స్క్వేర్‌’ కోసం మా టీం అంతా శక్తికి మించి కష్టపడింది. మొదటి పార్ట్‌కి ఏమాత్రం తగ్గదు. ఈ సినిమాలో థ్రిల్లింగ్‌, షాకింగ్‌, సర్ర్పైజ్‌ అంశాలు చాలా ఉన్నాయి. మా నిర్మాత నాగవంశీ, త్రివిక్రమ్‌, చినబాబు గారికి ధన్యవాదాలు. నేనూ, అనుపమా కలసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసినప్పుడు కొందరు నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారు. అమ్మాయిని అలా కామెంట్‌ చేయడం సరికాదు’ అన్నారు. మల్లిక్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘డీజే టిల్లు’ లాగానే ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సిద్ధుతో ఈ రెండేళ్ల ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పారు. డీజే టిల్లూకన్నా ఈ చిత్రం నాలుగురెట్లు వసూళ్లు సాధించాలని దర్శకుడు వెంకీ అట్లూరి ఆకాంక్షించారు. సిద్ధూ ఎనర్జీ లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకూ ఓ రేంజ్‌లో ఉంటుంది, ఈ సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవుతుందని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ తెలిపారు. సిద్ధూ ఎనర్జీ మైండ్‌ బ్లోయింగ్‌, పార్ట్‌ 2 డ బుల్‌ బొనాంజా అవుతుంది అని దర్శకుడు బాబీ చెప్పారు. చిత్రబృందం సక్సెస్‌ పార్టీకి సిద్ధంగా ఉండాలని నీరజ కోన కోరారు.

Updated Date - Mar 28 , 2024 | 01:08 AM