పోరాట ఘట్టాలు ప్రత్యేకాకర్షణగా

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:51 AM

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండి యా చిత్రం ‘దేవర’. ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ‘దేవర’గా ఎన్టీఆర్‌ యాక్షన్‌ ఓ రేంజ్‌లో ఉండబోతోందని సమాచారం...

పోరాట ఘట్టాలు ప్రత్యేకాకర్షణగా

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండి యా చిత్రం ‘దేవర’. ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ‘దేవర’గా ఎన్టీఆర్‌ యాక్షన్‌ ఓ రేంజ్‌లో ఉండబోతోందని సమాచారం. కొరటాల శివ సరికొత్త తరహాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేశారట. హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ కేన్నీ బే ట్స్‌ నేతృత్వంలో తెరకెక్కిన పోరాట ఘట్టాలు సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలువనున్నాయి. సముద్రంలో నీటి అడుగున తెరకెక్కిన ఫైట్స్‌ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Feb 16 , 2024 | 05:51 AM