పోరాట ఘట్టాలు అలరించే లా

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:51 AM

దర్శక నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు...

పోరాట ఘట్టాలు అలరించే లా

దర్శక నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తయిన సందర్భంగా రామకృష్ణ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ. కిరణ్‌ చేసిన స్టంట్స్‌ హైలైట్‌ అవుతాయి’ అన్నారు. దీక్షతో కృషి చేస్తే ఏదైనా సాధించగలం అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని కిరణ్‌ కుమార్‌ అన్నారు. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని నిర్మాతలు పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి చెప్పారు.

Updated Date - Jun 03 , 2024 | 06:51 AM