ఫ్యామిలీ ఆడియెన్స్‌ సెలబ్రేట్‌ చేసుకునేలా ఉంటుంది

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:56 AM

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ఠాకూర్‌ నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. పరశురామ్‌ పెట్ల దర్శకత్వం వహించారు. దిల్‌రాజు,శిరీశ్‌ నిర్మించారు. ఈ నెల 5న ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదలవుతోన్న సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు...

ఫ్యామిలీ ఆడియెన్స్‌ సెలబ్రేట్‌ చేసుకునేలా ఉంటుంది

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ఠాకూర్‌ నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. పరశురామ్‌ పెట్ల దర్శకత్వం వహించారు. దిల్‌రాజు,శిరీశ్‌ నిర్మించారు. ఈ నెల 5న ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదలవుతోన్న సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ స్టార్‌ సినిమా విషయంలో ప్రతీ విషయంలోనూ పాజిటివ్‌ వైబ్‌ కనిపిస్తోంది. డైరెక్టర్‌ కథ చెప్పగానే అందులోని పాయింట్‌ నన్ను ఎక్సైట్‌ చేసింది. ఈ సినిమాకు విజయ్‌ క్యారెక్టర్‌ వెన్నెముక లాంటిది. ఇది 30 శాతం ఫ్యామిలీ స్టోరీ, 70 శాతం లవ్‌ స్టోరీ. మృణాల్‌ లక్కీ హీరోయిన్‌. ఈ చిత్రంతో తెలుగులో ఆమె హ్యాట్రిక్‌ అందుకుంటుంది’’ అని అన్నారు. విజయ్‌ మాట్లాడుతూ ‘‘మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని చెప్పే వ్యక్తి ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్‌. ఈ సినిమాకు, ‘గీతాగోవిందం’ సినిమాకు ఏ పోలిక ఉండదు. ఈ కథ వింటున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చారు. అందుకే ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కి మా నాన్న పేరు గోవర్ధన్‌ అని పెట్టాం’’ అని చెప్పారు. మృణాల్‌ మాట్లాడుతూ ‘‘సీతారామం, హాయ్‌నాన్న తర్వాత నా నెక్స్ట్‌ తెలుగు ప్రాజెక్ట్‌ కోసం చాలా కథలు విన్నా. ఈ సినిమా కథ నాకు నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాను. మన జీవితాల్లోని ఎమోషన్స్‌, రిలేషన్స్‌, అచీవ్‌మెంట్స్‌, స్ట్రగుల్స్‌ అన్నీ ఈ మూవీలో రిలేట్‌ చేసుకుంటారు’’ అని తెలిపారు.

Updated Date - Apr 02 , 2024 | 05:56 AM