ముగింపు మెప్పిస్తుంది
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:02 AM
నోయల్, రిషిత నెల్లూరు జంటగా నటించిన ‘బహిర్భూమి’ చిత్రం ఈ నెల నాలుగున విడుదల కానుంది. రామ్‌ప్రసాద్ కొండూరు దర్శకత్వంలో మచ్చ వేణుమాధవ్ నిర్మించారు...
నోయల్, రిషిత నెల్లూరు జంటగా నటించిన ‘బహిర్భూమి’ చిత్రం ఈ నెల నాలుగున విడుదల కానుంది. రామ్‌ప్రసాద్ కొండూరు దర్శకత్వంలో మచ్చ వేణుమాధవ్ నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత మాట్లాడుతూ ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ మీద మీ సినిమా ట్రైలర్‌ను డిస్ ప్లే చేస్తున్నాం. తెలుగులో విడుదల చేసిన తర్వాత మిగిలిన భాషల్లో రిలీజ్ చేస్తాం’ అని చెప్పారు. బహిర్భూమి అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమా ముగింపు ప్రేక్షకులను మెప్పిస్తుందని నోయల్ చెప్పారు.