దర్శకుడే హీరో!

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:18 AM

కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా లభిస్తున్న ప్రస్తుత తరుణంలో దర్శకనిర్మాతలు ఇప్పుడు విభిన్న కథాంశాలను ఎన్నుకుంటూ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆ కోవలో వస్తున్న మరో చిత్రం ‘కళింగ’...

కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా లభిస్తున్న ప్రస్తుత తరుణంలో దర్శకనిర్మాతలు ఇప్పుడు విభిన్న కథాంశాలను ఎన్నుకుంటూ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆ కోవలో వస్తున్న మరో చిత్రం ‘కళింగ’. ఇంతకుముందు ‘కిరోసిన్‌’ చిత్రంలో నటించిన ధ్రువ వాయు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు కూడా ఆయనే. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సీనియర్‌ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోస్టర్‌లో హీరో, అతని వెనుక ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, హీరో చేతిలో కాగడ... ఇవన్నీ సినిమా మీద ఆసక్తి పెంచుతున్నాయి. ప్రగ్యా నయన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘ఆడుకాలం’ నరేన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మురళీధర్‌ గౌడ్‌, లక్ష్మణ్‌, తనికెళ్ల భరణి, సమ్మెట గాంధీ, బలగం సుధాకర్‌, సంజయ్‌కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌.

Updated Date - Jul 10 , 2024 | 01:18 AM