కంటెంట్‌ కొత్తగా ఉంది

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:44 AM

వెన్నెల కిశోర్‌, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. రైటర్‌ మోహన్‌ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. నేడు విడుదలవుతోంది...

దర్శకుడు బాబీ కొల్లి

వెన్నెల కిశోర్‌, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. రైటర్‌ మోహన్‌ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. నేడు విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబీ కొల్లి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కంటెంట్‌ చాలా కొత్తగా ఉంది. డైరెక్టర్‌ మోహన్‌ సస్పెన్స్‌ని బాగా హ్యాండిల్‌ చేయగలడని ట్రైలర్‌తోనే అర్థమైంది. ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. మోహన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి పనిచేసిన అందరూ తమ బెస్ట్‌ ఇచ్చారు. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమిది’’ అని చెప్పారు. ‘‘దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే నచ్చింది. కచ్చితంగా సినిమాతో హిట్‌ కొడుతున్నాం’’ అని అన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 03:44 AM