కాన్సెప్ట్‌ మెప్పించింది

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:48 AM

విరాన్‌ ముత్తంశెట్టి కథానాయకుడిగా వేణు మురళీధర్‌ వి. దర్శకత్వం వహించిన చిత్రం ‘ముఖ్య గమనిక’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోందని...

కాన్సెప్ట్‌ మెప్పించింది

విరాన్‌ ముత్తంశెట్టి కథానాయకుడిగా వేణు మురళీధర్‌ వి. దర్శకత్వం వహించిన చిత్రం ‘ముఖ్య గమనిక’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నిర ్వహించిన సక్సె్‌సమీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి మా చిత్రమే ఉదాహరణ. రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోంది’ అని చెప్పారు. నిర్మాతలు రాజశేఖర్‌, సాయికృష్ణ మాట్లాడుతూ ‘కొత్త కాన్సె్‌ప్టతో తీయడం వల్ల సినిమా ప్రేక్షకులకు చేరువైంది. తొలి చిత్రమే అయినా దర్శకుడు మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు’ అని ప్రశంసించారు. ‘ముఖ్య గమనిక’ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు హీరోయిన్‌ ఆర్యన్‌ కృష్ణన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Feb 27 , 2024 | 04:48 AM