క్లైమాక్స్‌ గుర్తుండిపోతుంది

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:45 AM

‘సెహరి’ సినిమాతో దర్శకుడిగా తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు జ్ఞానసాగర్‌ ద్వారక. ఆయన దర్శకత్వం వహించిన రెండో సినిమా ‘హరోం హర’. సుధీర్‌బాబు నటించిన ఈ చిత్రాన్ని సుమంత్‌...

 క్లైమాక్స్‌  గుర్తుండిపోతుంది

‘సెహరి’ సినిమాతో దర్శకుడిగా తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు జ్ఞానసాగర్‌ ద్వారక. ఆయన దర్శకత్వం వహించిన రెండో సినిమా ‘హరోం హర’. సుధీర్‌బాబు నటించిన ఈ చిత్రాన్ని సుమంత్‌.జి.నాయుడు నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక మీడియాతో ముచ్చటించారు. ‘‘యాక్షన్‌ సినిమాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. ‘హరోంహర’ ఒక న్యూ ఏజ్‌ కమర్షియల్‌ సినిమా. 1990ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ చిత్రంలో చాలా మాస్‌ ఎలిమెంట్స్‌, ఎలివేషన్స్‌ ఉంటాయి. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నాను. ఇందులో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేసే కథానాయకుడు.. గన్‌ మేకింగ్‌ మొదలుపెట్టి పవర్‌ఫుల్‌ సుబ్రమణ్యంగా ఎలా మారాడన్నది సినిమా కథ. లవ్‌, యాక్షన్‌, ఎమోషన్‌, సెంటిమెంట్‌తో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంటాయి. సినిమాలో సుధీర్‌బాబు నటన అద్భుతంగా ఉంటుంది. కుప్పం యాసలో ఆయన ఇరగదీశారు. సినిమాకు మ్యూజిక్‌, విజువల్స్‌ బాగా వచ్చాయి. ఈ సినిమా థియేటర్లలో చూస్తున్న ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. క్లైమాక్స్‌ అయితే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు.

Updated Date - Jun 12 , 2024 | 03:45 AM