సీతాకోక చిలుకై ఎగిరింది

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:43 AM

చిమటా రమేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నేను కీర్తన’. రిషిత, మేఘన కథానాయికలు. సీ లక్ష్మీకుమారి నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు...

సీతాకోక చిలుకై ఎగిరింది

చిమటా రమేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నేను కీర్తన’. రిషిత, మేఘన కథానాయికలు. సీ లక్ష్మీకుమారి నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి ‘సీతాకోక చిలుకై ఎగిరింది మనసే’ అంటూ సాగే యుగళ గీతాన్ని నిర్మాత సాయి రాజేశ్‌ చేతుల మీదుగా యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ ‘ఫస్ట్‌కాపీ సిద్ధమైంది. పాటలు, ఫైట్స్‌ మా చిత్రానికి ప్రత్యేకాకర్షణ. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 03:43 AM