బడ్జెట్‌ పెరిగినా వెనక్కు తగ్గలేదు

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:36 AM

శివ కందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మించారు. మార్చి 1న ఈ చిత్రం విడుదలవుతోంది...

బడ్జెట్‌ పెరిగినా వెనక్కు తగ్గలేదు

నిర్మాతలు స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌

శివ కందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మించారు. మార్చి 1న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు.

  • గతంలో ‘పీష్‌ మహల్‌’, ‘నీతో’ చిత్రాలు నిర్మించాం. ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ స్ర్కిప్ట్‌ అద్భుతంగా అనిపించడంతో బడ్జెట్‌ పెరిగినా ఎక్కడా రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మించాం. ఇదొక డిటెక్టివ్‌ థ్రిల్లర్‌. టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఓవర్సీస్‌, ఓటీటీ బిజినెస్‌ క్లోజ్‌ చేశాం.

  • ఇందులో కథే హీరో. ఇప్పటి వరకూ ఇలాంటి కథను ప్రేక్షకులు చూసి ఉండరు. ప్రతి ఇంటి ముందూ ఉండే దిష్టిబొమ్మ వెనుక ఉన్న కథేమిటి అనే అంశానికి ఫాంటసీ ఎలిమెంట్‌ను జోడించి ఆసక్తికరంగా తెరకెక్కించారు. పురుషోత్తం రాజ్‌ విజన్‌ ఉన్న దర్శకుడు. చాలా కొత్తగా తీశారు. పురాణాలతో ముడిపెట్టి కథను నడిపే తీరు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. డిటెక్టివ్‌గా శివ కందుకూరి పాత్రలో ఒదిగిపోయారు. హీరోయిన్‌ రాశీ సింగ్‌ కూడా ప్రతిభగల నటి. శ్రీ చరణ్‌ బీజీఎం సినిమాను ఓ స్థాయిలో నిలబెడుతుంది. ఏఐ టెక్నాలజీ వాడి రూపొందించిన శివ ట్రాన్స్‌ సాంగ్‌కు చక్కటి స్పందన రావడం ఆనందాన్నిచ్చింది.

Updated Date - Feb 22 , 2024 | 05:36 AM