The Birthday Boy: ఇంట్రస్టింగ్‌గా ‘ది బర్త్‌డే బాయ్’ టైటిల్ గ్లింప్స్

ABN , Publish Date - Jun 07 , 2024 | 08:37 PM

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘ది బ‌ర్త్‌డే బాయ్‌’. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కీ ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను శుక్ర‌వారం మేకర్స్ విడుద‌ల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

The Birthday Boy: ఇంట్రస్టింగ్‌గా ‘ది బర్త్‌డే బాయ్’ టైటిల్ గ్లింప్స్
The Birthday Boy Movie Still

కరోనా తర్వాత ప్రేక్షకులలో సినిమాను చూసే కోణం మారింది. రొటీన్ క‌థ‌ల‌పై ప్రేక్షకులు ఇంట్రస్ట్ పెట్టడం లేదు. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్‌తో వైవిధ్య‌మైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇప్పుడదే కోవ‌లో మ‌రో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని ఇవ్వబోతున్నాం అంటున్నారు ‘ది బ‌ర్త్‌డే బాయ్‌’ (The Birthday Boy) టీమ్. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘ది బ‌ర్త్‌డే బాయ్‌’. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కీ (Whisky) ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను శుక్ర‌వారం మేకర్స్ విడుద‌ల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. (The Birthday Boy Title Glimpse Released)

Also Read- Pawan Kalyan: పవర్ స్టార్ నిజజీవితంలో కూడా పవర్ ఫుల్, హోమ్ మినిస్టర్?


the-birthday-boy.jpg

ఇద్ద‌రూ స్నేహితులు మాట్లాడుకుంటున్న ఫ‌న్నీ సంభాష‌ణ‌తో ఈ టైటిల్ గ్లింప్స్ (The Birthday Boy Title Glimpse) ప్రారంభ‌మై.. చిత్రంలోని పాత్ర‌ల‌ను ప‌రిచయం చేసింది. ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ఈ చిత్రం ఉండ‌బోతోంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కముందని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 07 , 2024 | 08:37 PM