ఆరంభం... ఆ రోజే

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:23 AM

ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఆరంభం’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మే 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఏవీటీ ఎంటర్టైన్‌మెంట్‌...

ఆరంభం... ఆ రోజే

ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఆరంభం’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మే 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఏవీటీ ఎంటర్టైన్‌మెంట్‌ మంగళవారం తెలిపింది. అజయ్‌ నాగ్‌ వి, దర్శకత్వంలో అభిషేక్‌ వీటి నిర్మిస్తున్నారు. మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ ప్రధాన తారాగణం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ చిత్రం తెరకెక్కించాం. కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సింజిత్‌ యెర్రమిల్లి. సినిమాటోగ్రఫీ: దేవ్‌దీప్‌ గాంధీ.

Updated Date - Apr 24 , 2024 | 05:23 AM