కన్నడ నవల ఆధారంగా ఆరంభం

ABN , Publish Date - May 02 , 2024 | 04:33 AM

మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ కీలక పాత్రలు పోషించిన ‘ఆరంభం’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది....

కన్నడ నవల ఆధారంగా ఆరంభం

మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ కీలక పాత్రలు పోషించిన ‘ఆరంభం’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. అజయ్‌ నాగ్‌ వి దర్శకత్వంలో అభిషేక్‌ వీటీ నిర్మించారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ ‘కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేక పోయినా కథ విని చాలా ఇంప్రెస్‌ అయ్యాను. అందుకే సినిమా తీయాలని అనిపించింది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ బాగుంటోంది కనుక మా సినిమా విజయంపై నమ్మకం ఉంది’ అన్నారు. దర్శకుడు అజయ్‌ నాగ్‌ మాట్లాడుతూ ‘ఓ కన్నడ నవల ఆధారంగా ఈ సినిమా స్ర్కిప్ట్‌ తయారు చేశాను. ఒక జానర్‌లో కాకుండా వివిధ జానర్స్‌లో ఉండే సినిమా ఇది. మా కొత్త టీమ్‌తో ఇబ్బందులు ఉన్నా ఆర్టిస్టులు సహకరించారు. వెస్ట్రన్‌ ఘాట్స్‌లో షూటింగ్‌ చేశాం. తెలుగులో విడుదల చేసిన తర్వాత మిగిలిన భాషల్లో రిలీజ్‌ చేస్తాం’ అన్నారు.

Updated Date - May 02 , 2024 | 04:33 AM