ప్రేమకథకు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:52 AM

కిశోర్‌ కేఎస్‌డీ, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమకథ’. విజయ్‌ మట్టపల్లి, సుశీల్‌ వాజపిల్లి, శింగనమల కల్యాణ్‌ నిర్మాతలు. శివశక్తి రెడ్‌ డీ దర్శకుడు...

ప్రేమకథకు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు

కిశోర్‌ కేఎస్‌డీ, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమకథ’. విజయ్‌ మట్టపల్లి, సుశీల్‌ వాజపిల్లి, శింగనమల కల్యాణ్‌ నిర్మాతలు. శివశక్తి రెడ్‌ డీ దర్శకుడు. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. గురువారం చిత్రబృందం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమకథ’ చిత్ర నేపథ్యం నిజ జీవిత సంఘటనలకు దగ్గరగా ఉంటుంది. ప్రేక్షకులు కథాంశంతో కనెక్ట్‌ అవుతారు’ అన్నారు. ‘నటీనటులు అంతా కష్టపడి మంచి సినిమా చేశారు. మధుర శ్రీధర్‌, ధీరజ్‌, శింగనమల కల్యాణ్‌ సాయం చేశారు. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’ అని నిర్మాతలు కోరారు. మా సినిమాలో ఇద్దరు అందమైన హీరోయిన్లు ఉన్నారు, వారి నటన ఆకట్టుకుంటుందని కిశోర్‌ చెప్పారు. ‘ప్రేమకథ’ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉంటుంద ని దియా తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 06:52 AM