మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:12 AM

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ చిత్రంతో హిట్‌ కొడతాం అనుకున్నాం. అది నిజమైంది. నాకు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఇంకా పెద్ద హిట్‌ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను’ అని...

మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ చిత్రంతో హిట్‌ కొడతాం అనుకున్నాం. అది నిజమైంది. నాకు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఇంకా పెద్ద హిట్‌ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను’ అని హీరో సుహాస్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. సుహాస్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మిగిలిన పాత్రలకు కూడా సమాన పాధాన్యత ఉంది. అదే ఈ సినిమా స్ర్కిప్ట్‌కు బలం. మా సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ సక్సెస్‌ వచ్చింది’ అని చెప్పారు. నిర్మాత ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ నిజాయితీతో చేసిన ప్రయత్నం. సుహాస్‌ అయితే ఈ కథకు న్యాయం చేయగలడని నమ్మాం. ప్రేక్షకులు మా నమ్మకాన్ని నిజం చేశార’న్నారు. దర్శకుడు దుశ్యంత్‌ మాట్లాడుతూ ‘గీతాఆర్ట్స్‌, బన్నీవాసు గారు ధైర్యం చేయడం వల్లే ఈ సినిమా తీయగలిగాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు చాలా సంతోషంగా ఉంద’ని చెప్పారు. దుష్యంత్‌ నన్ను హిట్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం చేశారని శివాని తెలిపారు.

Updated Date - Feb 06 , 2024 | 01:12 AM