ప్రేక్షకులు ఒక్క క్షణం కూడా చూపు తిప్పరు

ABN , Publish Date - May 29 , 2024 | 06:34 AM

‘భజే వాయు వేగం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కానున్నారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి. కా ర్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్‌ జంటగా తెరకెక్కిన ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను...

ప్రేక్షకులు ఒక్క క్షణం కూడా చూపు తిప్పరు

‘భజే వాయు వేగం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కానున్నారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి. కా ర్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్‌ జంటగా తెరకెక్కిన ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ ఈ సినిమా విశేషాలను మీడియాకు తెలిపారు.


‘‘భజే వాయు వేగం’ సినిమా కథ ప్రకారం ఫస్టాఫ్‌కు ఒక పర్ఫార్మర్‌ కావాలి. సెకండాఫ్‌లో హీరోయిజం ఎలివేట్‌ కావాలి. అలా చూస్తే కార్తికేయ బెస్ట్‌ ఆప్షన్‌ అనిపించారు. అలాగే సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ఒక సంప్రదాయబద్దమైన అమ్మాయి కావాలి. ఐశ్వర్య మీనన్‌ ప్రొఫైల్‌ ఇందులోని ఇందు పాత్రకు యాప్ట్‌ అనిపించింది. కథలో హీరోకు బ్రదర్‌ క్యారెక్టర్‌కు రాహూల్‌ టైసన్‌ కరెక్ట్‌గా సరిపోయారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఒక్క క్షణం కూడా దృష్టి మరల్చకుండా చూస్తారు. ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ మరింత గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఇందులో హీరో ఒక గోల్‌ కోసం సిటీకి వస్తాడు. ఆ గోల్‌ను రీచ్‌ అయ్యే క్రమంలో వేరే సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి అసాధారణ సమస్యల్లో ఇరుక్కున్న హీరో అందులో నుంచి ఎలా బయటపడ్డాడో ఇందులో చాలా ఆసక్తికరంగా చూపిస్తున్నాం’’ అని చెప్పారు.

Updated Date - May 29 , 2024 | 06:34 AM