యాక్షన్‌ హంగామా

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:43 AM

ఆశిష్‌ గాంధీ, అశోక్‌, వర్ష, హ్రితిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘హద్దులేదురా’. రాజశేఖర్‌ రావి దర్శకత్వం వహిస్తున్నారు. వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మిస్తున్నారు. మార్చి 21న విడుదలవుతోంది...

యాక్షన్‌ హంగామా

ఆశిష్‌ గాంధీ, అశోక్‌, వర్ష, హ్రితిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘హద్దులేదురా’. రాజశేఖర్‌ రావి దర్శకత్వం వహిస్తున్నారు. వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మిస్తున్నారు. మార్చి 21న విడుదలవుతోంది. ఆదివారం, ఈ చిత్రం ట్రైలర్‌ను డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు. దర్శకుడు రాజశేఖర్‌కి ఇది మొదటి చిత్రమైనా, ఎన్నో చిత్రాల అనుభవం ఉన్న డైరెక్టర్‌లా చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ఫ్రెండ్షిప్‌తో పాటు మంచి యాక్షన్‌ కూడా ఉంది అని ప్రశంసించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎలాంటి హద్దులూ పెట్టుకోకుండా జీవితాన్ని నచ్చినట్లు బ్రతకాలని ఈ చిత్రానికి ‘హద్దులేదురా’ అనే టైటిల్‌ పెట్టాం’’ అని తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 06:43 AM