అందుకే ‘డ్రిల్‌’ పేరు పెట్టాం

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:03 AM

అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్న హరనాథ్‌ పొలిచెర్ల హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డ్రిల్‌’ ఈ నెల 16న విడుదల కానుంది. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించారు...

అందుకే ‘డ్రిల్‌’ పేరు పెట్టాం

డాక్టర్‌ హరనాథ్‌ పొలిచెర్ల

అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్న హరనాథ్‌ పొలిచెర్ల హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డ్రిల్‌’ ఈ నెల 16న విడుదల కానుంది. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించారు. సినిమా విడుదల సందర్బంగా డాక్టర్‌ హరనాథ్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘నాకు చిన్పన్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నాను. ఆ వృత్తిలో ఎంతో బిజీగా ఉంటాను. ఒక రోజు ‘మన లక్ష్యం ఏమిటి, వెళుతున్న దారి ఏమిటి అని అనిపించింది. దాంతో నటన వైపు మళ్లాను. తెలుగులో ఎనిమిది చిత్రాలు తీశా. కన్నడంలో నటించా. చాలా రోజుల తర్వాత మళ్లీ ‘డ్రిల్‌’ చిత్రం చేశా’ అని చెప్పారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్‌ బేస్డ్‌ మూవీ. లవ్‌ జిహాద్‌ అనేది ఒక అంశం మాత్రమే. నేను పోలీస్‌ ఆఫీసర్‌గా నటించా. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. తొలి కాపీ చూసిన తర్వాత ఆ కష్టం మరిచిపోయాను. ‘డ్రిల్‌’ అనేది ఒక ఆయుధం. మా సినిమాలో హంతకుడు డ్రిల్లింగ్‌ మిషన్‌ వాడి అందరినీ చంపుతుంటాడు. ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడం కోసం సినిమాకు ‘డ్రిల్‌’ అని టైటిల్‌ పెట్టాం’ అన్నారు. ఇలాంటి క్రైమ్‌ థ్రిల్లర్స్‌కు ఫొటోగ్రఫీ, సంగీతం చాలా కీలకం అని చెబుతూ ఛాయాగ్రాహకుడు వంశీకృష్ణ, సంగీత దర్శకుడు డిఎ్‌సఎ్‌సకె అద్భుతంగా పని చేశారని హరనాథ్‌ చెప్పారు.

Updated Date - Feb 13 , 2024 | 06:04 AM