ప్రేక్షకులు దూరమైంది అందుకే

ABN , Publish Date - Aug 18 , 2024 | 01:30 AM

‘ప్రేక్షకుల్ని చెడగొట్టింది మేమే.‘మీరు ఇంట్లోనే కూర్చోండి.. నాలుగు వారాల్లో సినిమాను ఓటీటీలో చూపిస్తాం’ అని వారిని థియేటర్‌కు రాకుండా చేసుకున్నాం’ అని నిర్మాత దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు...

‘ప్రేక్షకుల్ని చెడగొట్టింది మేమే.‘మీరు ఇంట్లోనే కూర్చోండి.. నాలుగు వారాల్లో సినిమాను ఓటీటీలో చూపిస్తాం’ అని వారిని థియేటర్‌కు రాకుండా చేసుకున్నాం’ అని నిర్మాత దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రేవు’ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దిల్‌ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమా తీయడం గొప్ప కాదు. ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడం ముఖ్యం’ అన్నారు. ‘రేవు’ సినిమా కాన్సెప్ట్‌ బాగుంది. ఈ చిత్రాన్ని చూసి నేనూ రివ్యూ రాస్తా’ అన్నారు దిల్‌ రాజు. నిర్మాతల్లో ఒకరైన మురళి మాట్లాడుతూ ‘ఒక మంచి చిత్రంతో నా సినీ జర్నీ మొదలైంది. మా సినిమాను చూసి ఆదరించండి’ అని కోరారు. తక్కువ బడ్జెట్‌లోనే ఎంత అద్భుతంగా సినిమా తీయవచ్చో దర్శకుడు హరినాథ్‌ నిరూపించారు’ అని ప్రభు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత పర్వతనేని రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2024 | 01:30 AM