హీరోగా రాజ్‌తరుణ్‌ అందుకే

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:13 AM

రాజ్‌తరుణ్‌, హాసిని జంటగా నటించిన చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్‌ భీమన దర్శకత్వంలో డా.రమేశ్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రామ్‌భీమన, నిర్మాత డా.రమేశ్‌ తేజావత్‌, హీరోయిన్‌ హాసి...

రాజ్‌తరుణ్‌, హాసిని జంటగా నటించిన చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్‌ భీమన దర్శకత్వంలో డా.రమేశ్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రామ్‌భీమన, నిర్మాత డా.రమేశ్‌ తేజావత్‌, హీరోయిన్‌ హాసిని మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు రామ్‌భీమన మాట్లాడుతూ ‘‘మా బడ్జెట్‌కు తగ్గ హీరో కోసం అన్వేషిస్తున్న క్రమంలో రాజ్‌తరుణ్‌ అయితే అన్ని విధాలా బావుంటుందనిపించింది. అందుకే అయన్ను హీరోగా తీసుకున్నాం’’ అని చెప్పారు. నిర్మాత డా. రమేశ్‌ తేజావత్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. కుటుంబమంతా కలసి చూసేలా సినిమాను రూపొందించాం. ప్రతీ సన్నివేశాన్ని ఎంతో క్వాలిటీతో తెరకెక్కించాము’’ అని తెలిపారు. హీరోయిన్‌ హాసిని మాట్లాడుతూ ‘‘ఇందులో నాకు, రాజ్‌ తరుణ్‌కు మధ్య వచ్చే లవ్‌ట్రాక్‌ అద్భుతంగా ఉంది. నేను పోషించిన పాత్ర అందరికీ నచ్చుతుంది. సినిమాలో ఏడు పాటలున్నాయి. వేటికవే ప్రత్యేకంగా ఉండే ఆ పాటలు తెరపై ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయి’’ అని చెప్పారు.

Updated Date - Jul 25 , 2024 | 06:13 AM