శబరి రాక అప్పుడే

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:58 AM

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. అనిల్‌ కాట్జ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మాత. ‘శబరి’ విడుదల తేదీ ఖారారైంది. మే 3న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ...

శబరి రాక అప్పుడే

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. అనిల్‌ కాట్జ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మాత. ‘శబరి’ విడుదల తేదీ ఖారారైంది. మే 3న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఆదివారం మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘శబరి’ కథ, కథనం కొత్తగా ఉంటాయి. ఎమోషనల్‌ థ్రిల్లర్‌. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది’ అన్నారు. సునయన, వైవా హర్ష, భద్రం కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: గోపీసుందర్‌, సినిమాటోగ్రఫీ: రాహుల్‌ శ్రీవాత్సవ

Updated Date - Apr 08 , 2024 | 12:58 AM