ఆ కోరిక గీతాంజలితో తీరింది

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:06 AM

అందాల నటి అంజలి నటించిన ‘గీతాంజలి’ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్‌ సంస్థతో కలసి...

ఆ కోరిక గీతాంజలితో తీరింది

అందాల నటి అంజలి నటించిన ‘గీతాంజలి’ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్‌ సంస్థతో కలసి కోన వెంకట్‌ నిర్మించారు.ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కోన వెంకట్‌ మాట్లాడుతూ ‘ఒక తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేయడం చాలా గొప్ప విషయం. అందుకే అంజలిని అభినందించాలి. ఆమెకు ఇది 50వ సినిమా. ఈ చిత్రానికి నేను కథ ఇచ్చినా దాన్ని పది మెట్లు ఎక్కించి ముందుకు తీసుకువెళ్లారు భాను, నందు. స్ర్కిప్ట్‌లో ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. దర్శకుడు శివకు ఇది బెస్ట్‌ మూవీ అవుతుంది’ అన్నారు. హీరోయున్‌ అంజలి మాట్లాడుతూ ‘నా 50వ సినిమా చాలా స్పెషల్‌గా ఉండాలనుకున్నాను. ఆ కోరిక ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రంతో తీరింది. అందరినీ ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాం. కామెడీ, హారర్‌ ఎలిమెంట్స్‌ మిక్స్‌ చేసిన చిత్రమిది. ‘గీతాంజలి’ కంటే వంద రెట్లు బాగుంటుంది’ అని చెప్పారు సినిమా ట్రైలర్‌ అందరికీ నచ్చే ఉంటుందనీ, అంతకు మించి సినిమా ఉంటుందని దర్శకుడు శివ చెప్పారు. ఈ చిత్రంలో తను చెనక్కాయల శీను పాత్ర పోషించాననీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ‘గీతాంజలి’ కంటే ఈ చిత్రం మరింత భయపెడుతుంది, నవ్విస్తుంది అని సత్యం రాజేశ్‌ తెలిపారు.

Updated Date - Apr 04 , 2024 | 02:06 AM