ఆ టైమ్‌ వచ్చింది

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:00 AM

తన రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన సమయం అన్నారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో...

ఆ టైమ్‌ వచ్చింది

తన రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన సమయం అన్నారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆమె మాట్లాడుతూ ‘సినిమాల్లో ఉంటూనే రాజకీయ పార్టీలతో తలపడ్డాను. నటిగా కన్నా దేశహితం కోరుకునే జాతీయవాదిగానే నాకు గుర్తింపు ఎక్కువ. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నాపై చాలా ప్రేమ చూపించారు. దేశం నాకు చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వడం నా బాధ్యత. ఒకవేళ నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటే అందుకు ఇదే సరైన సమయం’ అన్నారు. ఆమె త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కంగనా రనౌత్‌ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు. అలాగే ‘తను వెడ్స్‌ మను’, ‘క్వీన్‌ 2’ చిత్రాల్లో కంగన నటిస్తున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 04:00 AM