ఆ పాయింట్‌ థ్రిల్‌ చేస్తుంది

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:24 AM

‘స్వతంత్ర భావాలున్న అమ్మాయి, సాఫ్ట్‌వేర్‌ అబ్బాయి మధ్య సాగే ప్రేమాయణమే ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. ఈ సినిమాలో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అంశం ఒకటుంది. ఇప్పటివరకూ ప్రచార చిత్రాల్లో..

ఆ పాయింట్‌ థ్రిల్‌ చేస్తుంది

‘స్వతంత్ర భావాలున్న అమ్మాయి, సాఫ్ట్‌వేర్‌ అబ్బాయి మధ్య సాగే ప్రేమాయణమే ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. ఈ సినిమాలో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అంశం ఒకటుంది. ఇప్పటివరకూ ప్రచార చిత్రాల్లో దాన్ని వెల్లడించలేదు. ఆ పాయింట్‌ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది’ అని నిర్మాత అఖిలేశ్‌ కలారు అన్నారు. వి.ఎస్‌ ముఖేశ్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రమిది. పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించారు. ఈ నెల 19న విడుదలవుతోన్న సందర్భంగా అఖిలేశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. సినిమాలపై మక్కువతో నిర్మాతగా మారాను. ముఖేశ్‌ చాలాకాలంగా తెలుసు. ఆయన చెప్పిన కథ నచ్చి ‘మార్కెట్‌ మహాలక్ష్మి’ సినిమాను నిర్మించాను. ఇండస్ట్రీలో మంచి నిర్మాతగా పేరు తెచ్చుకునేవరకూ నా ప్రయాణం కొనసాగుతుంది’ అన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 06:25 AM