ఆ సినిమా ఆమె జాతకాన్ని మార్చేసింది

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:08 AM

ఒకే ఒక్క అవకాశం చాలా మంది జీవితాల్ని మార్చేస్తుంది. గ్లామర్‌ నటి త్రిప్తి దిమ్రి విషయంలో అదే జరిగింది. రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘యానిమల్‌’ సినిమాతో ఆమె ఒక్కసారిగా నేషనల్‌...

ఆ సినిమా ఆమె జాతకాన్ని మార్చేసింది

ఒకే ఒక్క అవకాశం చాలా మంది జీవితాల్ని మార్చేస్తుంది. గ్లామర్‌ నటి త్రిప్తి దిమ్రి విషయంలో అదే జరిగింది. రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘యానిమల్‌’ సినిమాతో ఆమె ఒక్కసారిగా నేషనల్‌ క్రష్‌ అయిపోయింది. ఎవరీమె, వివరాలు ఏమిటి.. అని గూగుల్‌లో చాలా మంది సెర్చ్‌ చేశారు. ఆ సినిమా విడుదలైన దగ్గర నుంచి అభినందనలు, అవకాశాలు, ఫోన్లు, సందేశాలు....వాటితో క్షణం కూడా తీరిక చిక్కడం లేదు ఆమెకు. ‘యానిమల్‌’ చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. ఎంతో మంది అభిమానంతో పోన్‌ చేసి అభినందిస్తున్నారు. వాళ్లు పంపే మెసేజ్‌లు చదువుతుంటే ఆనందంతో నాకు రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు. కొత్త అవకాశాలు కూడా వెదుక్కుంటూ వస్తున్నాయి. దర్శకుడు సందీ్‌పరెడ్డికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావడం లేదు’ అని ఆమె ఓ ఆంగ్ల వెబ్‌ సైట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది. హీరో రణబీర్‌ అద్భుతమైన నటుడు అని ఈ సందర్భంగా త్రిప్తి చెప్పింది. ‘యానిమల్‌’లో హీరోయిన్‌గా నటించిన రష్మిక గురించి మాట్లాడుతూ ‘సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ ఎనర్జీ వేరు. రష్మిక చాలా మంచి వ్యక్తి. తొలి రోజు షూటింగ్‌లో కలసినప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి, హగ్‌ చేసుకుని అభినందనలు తెలిపింది. సెట్‌లో రష్మిక ఎలా ఉంటుందా అని మొదట నేను భయపడ్డా కానీ ఆమె తన ప్రవర్తనతో నన్ను ఆకట్టుకొంది.

Updated Date - Jan 03 , 2024 | 01:08 AM