మీ మధ్య ఉన్న తేడా అదే

ABN, Publish Date - Oct 07 , 2024 | 03:43 AM

తన సొంత రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్‌ కోల్పోయిన ఓ జోకర్‌... విజేతలు కూర్చొన్న వేదికను పంచుకోవడం గర్వంగా భావిస్తున్నారంటూ సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ను ఉద్దేశించి కోలీవుడ్‌ నిర్మాత ఎస్‌.వినోద్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు...

  • ప్రకాష్‌ రాజ్‌పై నిర్మాత వినోద్‌ కుమార్‌ ట్వీట్‌

తన సొంత రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్‌ కోల్పోయిన ఓ జోకర్‌... విజేతలు కూర్చొన్న వేదికను పంచుకోవడం గర్వంగా భావిస్తున్నారంటూ సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ను ఉద్దేశించి కోలీవుడ్‌ నిర్మాత ఎస్‌.వినోద్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. శనివారం చెన్నైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రకాష్‌ రాజ్‌ పాల్గొని ‘మన ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. మరొకరు ఉన్నారు ‘స’కారం (సనాతన ధర్మం) గురించి మాట్లాడుతారంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పేరు ప్రస్తావించకుండా సెటైర్లు వేశారు. దీనిపై నిర్మాత వినోద్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ‘నీ పక్కన కూర్చొన్న ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో విజయం సాధించారు. నీవేమో డిపాజిట్లు కూడా కోల్పోయావు. మీ మధ్య ఉన్న తేడా అదే.


ఒక సినిమా షూటింగులో మాకు ఒక్కమాట కూడా చెప్పకుండా క్యారవాన్‌ నుంచి వెళ్ళి, రూ.కోటి నష్టం వాటిల్లేలా చేశావు. అలా చేయడానికి కారణం ఏమిటి? జస్ట్‌ ఆస్కింగ్‌? కాల్‌ చేసి జరిగిందంతా చెప్తానన్నావ్‌. కానీ ఇప్పటివరకు కాల్‌ చేయలేదు’ అని పేర్కొన్నారు.

చెన్నై, (ఆంధ్రజ్యోతి)

ఐన్‌స్టీన్‌కు కూడా కష్టమే

మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘కొండా సురేఖ తుపాకి గురిపెట్టింది కేటీఆర్‌కు, కాల్చింది మాత్రం నాగార్జున, నాగచైతన్యను, క్షమాపణ చెప్పిందేమో సమంతకు...ఐన్‌స్టీన్‌ కూడా ఈ ఈక్వేషన్‌ను పరిష్కరించలేడేమోనని నా డౌట్‌’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.


పైనుంచి ఆదేశాలు అందాయా...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్జీఆర్‌ సేవలను స్మరించుకుంటూ శనివారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. ‘హఠాత్తుగా ఎమ్జీఆర్‌పై ఎందుకింత ప్రేమో... పై నుంచి ఆదేశాలు అందాయా..’అంటూ ఆదివారం వ్యంగంగా ట్వీట్‌ చేశారు.

Updated Date - Oct 07 , 2024 | 03:43 AM