ఆ నమ్మకం నిజమైంది

ABN , Publish Date - Mar 21 , 2024 | 05:55 AM

‘చాలా కొత్త అంశంతో, ఇంతవరకూ ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం రూపొందించా. చాలా సార్లు కొత్త పాయింట్‌ దొరికినప్పుడు ఒకటే జానర్‌కి ఫిక్స్‌ అవుతాం...

ఆ నమ్మకం నిజమైంది

‘చాలా కొత్త అంశంతో, ఇంతవరకూ ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం రూపొందించా. చాలా సార్లు కొత్త పాయింట్‌ దొరికినప్పుడు ఒకటే జానర్‌కి ఫిక్స్‌ అవుతాం. అలా కాకుండా డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేస్తూ కంప్లీట్‌ ఎంటర్‌టైనింగ్‌గా చిత్రం ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపూ ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణతో కలసి ఆయన నటించిన ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

  • ఈ సినిమాకు రెండు, మూడు టైటిల్స్‌ అనుకున్నాం. అయితే నేను మొదటి నుంచి ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రానికి ఓటు వేశాను. చాలా క్యాచీ టైటిల్‌ ఇది. నిర్మాత వంశీగారు ఫస్ట్‌ కట్‌ చూసి ఈ టైటిల్‌కే ఫిక్స్‌ అవుదాం.. అన్నారు. ఆ టైటిల్‌కు మంచి రెస్పాన్స్‌ రావడం ఆనందంగా ఉంది. సినిమాలో మిస్టరీ, థ్రిల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ ఉన్నాయి. నేను, ప్రియదర్శి, రాహుల్‌ మంచి స్నేహితులం. రెగ్యులర్‌గా కలుస్తుంటాం. అందుకే ఆడుతూ పాడుతూ సినిమా పూర్తి చేశాం.

  • ప్రేక్షకులు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మరో అంశం కూడా బాగుందని అంటారు. అదేమిటో సినిమా చూశాక తెలుస్తుంది.

  • నిర్మాత పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలన్నదే ఎప్పుడూ నా ఆలోచన. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడికి మూడు, నాలుగు రెట్లు లాభం రావడం చాలా తృప్తినిచ్చింది. ‘సామజవరగమన’ చిత్ర విజయం, ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, యూవీ బేనర్‌ ఈ సినిమాకు బాగా హెల్స్‌ అయ్యాయి. మంచి బేనర్‌లో సినిమాలు చేయడం వల్ల అన్ని విషయాల్లో వారే కేర్‌ తీసుకుంటారు కనుక నా ఒత్తిడి తగ్గింది.

  • దర్శకుడు శ్రీహర్ష చెప్పిన కథకు కొంచెం కలర్‌ఫుల్‌గా వెళితే బావుంటుందనిపించింది. డివోపీ రాజ్‌ తోటతో ఆరు సినిమాలు చేశాను. వాళ్లిద్దరికీ మంచి సింక్‌ ఉంది. అలాగే సన్నీ సంగీతం అంటే నాకు ఇష్టం. ఒక అద్భుతమైన ప్రొడక్షన్‌ హౌస్‌కి మంచి టీమ్‌ కుదిరితే సినిమా టెక్నికల్‌గా బాగుంటుదనే నమ్మకం ఈ సినిమా విషయంలో మరోసారి నిజమైంది.

Updated Date - Mar 21 , 2024 | 05:55 AM