‘కల్కి’ టీమ్‌కు థ్యాంక్స్‌

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:20 AM

దర్శకుడిగా ఎన్నో సంచలన చిత్రాలను తెరకెక్కించి ఎంతో మంది నూతన దర్శకులకు ఆదర్శంగా నిలిచిన రామ్‌గోపాల్‌వర్మ.. ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమాతో కొత్త అవతారం ఎత్తారు...

‘కల్కి’ టీమ్‌కు  థ్యాంక్స్‌

దర్శకుడిగా ఎన్నో సంచలన చిత్రాలను తెరకెక్కించి ఎంతో మంది నూతన దర్శకులకు ఆదర్శంగా నిలిచిన రామ్‌గోపాల్‌వర్మ.. ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమాతో కొత్త అవతారం ఎత్తారు. గురువారం విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రంలో ఆయన ఓ అతిధి పాత్రలో మెరిశారు. ఇన్నేళ్లు సినీరంగంలో ఉన్న ఆయన.. ఓ సినిమాలో నటించడం మాత్రం ఇదే ప్రధమం. ఇందులో ఆయన పాత్ర చిన్నదైనా ఎంతో వినోదాత్మకంగా ఉందని సినిమా చూసిన వారంతా అనడం విశేషం. ఈ సందర్భంగా చిత్రబృందానికి, డైరెక్టర్‌కి థ్యాంక్స్‌ చెప్పి.. ఇందులో నటించిన వారందరినీ ప్రశంసించారు. ప్రభాస్‌ నటించిన ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించారు. వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్‌ నిర్మించిన ఈ చిత్ర కథ మహా భారతంతో మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యేలా, మొత్తం ఆరు వేల ఏళ్ల సంవత్సరాల వ్యవధిలో జరిగేలా తెరకెక్కింది.

Updated Date - Jun 28 , 2024 | 04:20 AM