తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు
ABN , Publish Date - Sep 02 , 2024 | 04:12 AM
హారర్ థ్రిల్లర్ ‘డీమాంటీ కాలనీ 2’ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హీరో అరుల్ నిధి ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు నెలలో విడుదలైన ఈ చిత్రాన్ని బి.సురేశ్‌రెడ్డి, మానస రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందించారు...
హారర్ థ్రిల్లర్ ‘డీమాంటీ కాలనీ 2’ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హీరో అరుల్ నిధి ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు నెలలో విడుదలైన ఈ చిత్రాన్ని బి.సురేశ్‌రెడ్డి, మానస రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుల్ నిధి మాట్లాడుతూ ‘తమిళంలో మా సినిమా బాగా ఆడుతోంది. తెలుగులో నిర్మాత సురేశ్‌రెడ్డి బాగా ప్రమోట్ చేశారు. ఆయన వల్లే సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. త్వరలో హైదరాబాద్ వచ్చి సక్సెస్ మీట్ నిర్వహిస్తాం’ అన్నారు. ఈ సినిమాకు మరో రెండు సీక్వెల్స్ వస్తాయనీ, ‘డీమాంటీ కాలనీ 3’ భారీ స్థాయిలో ఉంటుందని, ఇందులో ఊహించని మలుపులు ఉంటాయనీ అరుల్ నిధి చెప్పారు. ‘ఈ సినిమా పార్ట్ వన్‌లో ఒక పాత్ర చేశాను. పార్ట్ 2 లో రెండు పాత్రలు పోషించాను. పార్ట్ 3లో దర్శకుడు అజయ్ ఎన్ని పాత్రలు చేయిస్తారో చూడాలి.
ఇంతవరకూ ఎక్కువగా థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ చేశాను. ఇకపై ఇతర చిత్రాల్లో కూడా నటించాలనుకుంటున్నాను’ అని చెప్పారు అరుల్ నిధి.