వర్క్‌ పూర్తి చేసుకున్న తలైవా

ABN , Publish Date - May 15 , 2024 | 12:31 AM

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘వేట్టయాన్‌’ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తెలుగు టైటిల్‌ ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు. ‘జై భీమ్‌’ సినిమాకు...

వర్క్‌ పూర్తి చేసుకున్న తలైవా

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘వేట్టయాన్‌’ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తెలుగు టైటిల్‌ ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు. ‘జై భీమ్‌’ సినిమాకు దర్శకత్వం వహించిన టీజే జ్ఞానవేల్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బేనరుపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాసిల్‌, రానా, మంజు వారియర్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తన పాత్రకు సంబంధించిన వర్క్‌ను రజనీకాంత్‌ పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్‌ ఆయనకు వీడ్కొలు పలికింది. భారీ స్థాయిలో అంచనాలు కలిగిన ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తుండగా, ఎస్‌.ఆర్‌.కతీర్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

Updated Date - May 15 , 2024 | 12:31 AM