Legally Veer: ‘లీగల్లీ వీర్’ మూవీ టీమ్‌కు దిల్ రాజు అభినందనలు.. ఎందుకంటే
ABN , Publish Date - Dec 31 , 2024 | 09:43 PM
డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలై.. ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోన్న ‘లీగల్లీ వీర్’ టీమ్‌కు నిర్మాత దిల్ రాజు అభినందనలు తెలిపారు. ఇలాంటి సినిమా రావాలని, ప్రేక్షకులు వాటిని ఆదరించాలని కోరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
మలికిరెడ్డి వీర్ డైనమిక్ అడ్వకేట్ పాత్రలో.. దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో.. సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా ‘లీగల్లీ వీర్’ చిత్ర యూనిట్ సభ్యులను నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు అభినందించారు.
Also Read-Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..
‘లీగల్లీ వీర్’ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సార్లు రుజువు అయిందన్నారు. మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ టీమ్‌కు నా అభినందనలు. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడండి. మంచి కంటెంట్ పిక్చర్ అని దిల్ రాజు ఈ మూవీ గురించి చెప్పుకొచ్చారు.
అనంతరం హీరో మలికిరెడ్డి వీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలన్న తపనతో ‘లీగల్లీ వీర్’ సినిమా చేశాం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా మా ‘లీగల్లీ వీర్’ సినిమాను అభినందించడం ఆనందంగా ఉంది. ఆయనకు మా టీమ్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.’’ అని చెప్పగా.. దర్శకుడు రవి మాట్లాడుతూ..‘‘సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు మా ‘లీగల్లీ వీర్’ సినిమాను అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. డిసెంబర్ 27న విడుదలైన మా సినిమాను చూసి హిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు’’ అని అన్నారు.