మహిళలకు టెనెంట్‌ సందేశం

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:08 AM

‘పొలిమేర 2’ చిత్రం ఘన విజయం తర్వాత సత్యం రాజేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘టెనెంట్‌’. వై. యుగంధర్‌ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నారు...

మహిళలకు టెనెంట్‌ సందేశం

‘పొలిమేర 2’ చిత్రం ఘన విజయం తర్వాత సత్యం రాజేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘టెనెంట్‌’. వై. యుగంధర్‌ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు చక్కటి స్పందన వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్‌ చేసే అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు. ‘ఈ తరం మహిళలు ఎంత జాగ్రత్తగా మెలగాలో ఈ చిత్రంలో చూపించబోతున్నాం, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. ఏప్రిల్‌ మూడో వారంలో ‘టెనెంట్‌’ను విడుదల చేస్తాం’ అని నిర్మాత తెలిపారు. మేఘా చౌదరి, చందన పయావుల కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాహిత్య సాగర్‌. సినిమాటోగ్రఫీ: జెమిన్‌ జోమ్‌

Updated Date - Mar 20 , 2024 | 06:08 AM