గొప్ప కంటెంట్‌తో టెనెంట్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:14 AM

సత్యం రాజేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టెనెంట్‌’. వై. యుగంధర్‌ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించారు. ఈనెల 19న విడుదలవుతోంది....

గొప్ప కంటెంట్‌తో టెనెంట్‌

సత్యం రాజేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టెనెంట్‌’. వై. యుగంధర్‌ దర్శకత్వంలో మోగుళ్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించారు. ఈనెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. నటుడు ప్రియదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్యం రాజేశ్‌ మాట్లాడుతూ ‘డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయి. ఇందులో గొప్ప కంటెంట్‌ ఉంది. ప్రేక్షకులు ప్రతి క్షణం ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మహిళలకు కనెక్ట్‌ అయ్యే కథ ఇది. మా నిర్మాత రాజీపడకుండా నిర్మించారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రమవుతుంద’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘బలగం, కాంతార’ లాంటి సహజత్వం ఉన్న కథతో తెరకెక్కిన సినిమా ‘టెనెంట్‌’. ఈ చిత్రంలో భావోద్వేగాలు అద్భుతంగా పండాయి’ అని చెప్పారు.

Updated Date - Apr 14 , 2024 | 04:14 AM