Tenant: ‘టెనెంట్’ విడుదల ఎప్పుడంటే..

ABN , Publish Date - Mar 19 , 2024 | 09:01 PM

‘మా ఊరి పొలిమేర2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి. ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదలకు సంబంధించి వివరాలను మేకర్స్ తెలియజేశారు.

Tenant: ‘టెనెంట్’ విడుదల ఎప్పుడంటే..
Tenant Movie Still

‘మా ఊరి పొలిమేర2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ (Satyam Rajesh) హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘టెనెంట్’ (Tenant Movie). వై.యుగంధర్ (Y Yugandhar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి. ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదలకు సంబంధించి వివరాలను మేకర్స్ తెలియజేశారు.

ప్రజెంట్ జనరేషన్‌లో మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్‌తో పాటు.. ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని.. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ మూడో వారంలో మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. (Tenant Movie Release Details)


Satyam-Rajesh.jpg

మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. జెమిన్ జోమ్ అయ్యనేత్ డీవోపీ కాగా విజయ్ ముక్తవరపు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Ustaad Bhagat Singh: ‘భగత్స్ బ్లేజ్’.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం

********************

*Kaliyugam Pattanamlo: ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదు.. ట్రెండింగ్‌లో ట్రైలర్

******************

*Niharika Konidela: ఆరోజు రాడిస‌న్ బ్లూ ప‌బ్‌లో ఏం జరిగిందంటే..

**************************

Updated Date - Mar 19 , 2024 | 09:01 PM