పది రోజుల వర్కే బ్యాలెన్స్‌

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:26 AM

ఒక సినిమా తర్వాతే మరో సినిమా చేయడం తమిళ దర్శకుడు శంకర్‌కు అలవాటు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఆయన ఒకేసారి రెండు సినిమాలు.. ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ఛేంజర్‌’ చేయాల్సి వస్తోంది. విశిష్ట నటుడు కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం వచ్చే నెలలో..

పది రోజుల వర్కే బ్యాలెన్స్‌

ఒక సినిమా తర్వాతే మరో సినిమా చేయడం తమిళ దర్శకుడు శంకర్‌కు అలవాటు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఆయన ఒకేసారి రెండు సినిమాలు.. ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ఛేంజర్‌’ చేయాల్సి వస్తోంది. విశిష్ట నటుడు కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం వచ్చే నెలలో విడుదలవుతుండడంతో కాస్త ఊపిరి తీసుకున్న శంకర్‌ ఒకపక్క ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ఛేంజర్‌’ మీద కూడా దృష్టి పెట్టారు. ఈ సినిమా గురించి అప్‌డేట్‌ వచ్చి చాలా కాలం అవుతోంది. ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్‌ఛేంజర్‌’ గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. ‘సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది. ఇంకో పది రోజుల వర్క్‌ మాత్రమే మిగిలి ఉంది. ‘భారతీయుడు 2’ విడుదల కాగానే ఆ వర్క్‌ మొదలుపెడతాను. ఆ తర్వాత ఫైనల్‌ పుటేజ్‌ చూసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభిస్తా. అవన్నీ పూర్తయ్యాక విడుదల ఎప్పుడనేది నిర్ణయిస్తా.


సాధ్యమైనంత వరకూ తొందరగానే ‘గేమ్‌ఛేంజర్‌’ రిలీజ్‌ చేయడానికి ప్రయత్నిస్తా’ అని శంకర్‌ వెల్లడించారు. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఓ పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ‘గేమ్‌ఛేంజర్‌’ లో కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సమ్రుదఖని, నవీన్‌చంద్ర, అజయ్‌ ఘోష్‌ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Jun 28 , 2024 | 04:26 AM