మరో తెలుగు సినిమా చేస్తా

ABN, Publish Date - Oct 19 , 2024 | 06:24 AM

‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌: మహానాయకుడు’ చిత్రాల్లో నటించా. మరిన్ని తెలుగు సినిమాలు చేయాలనుంది. మంచి కథ దొరికితే మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధంగా

‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌: మహానాయకుడు’ చిత్రాల్లో నటించా. మరిన్ని తెలుగు సినిమాలు చేయాలనుంది. మంచి కథ దొరికితే మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ అన్నారు. కార్తిక్‌ ఆర్యన్‌తో కలసి ఆమె కీలకపాత్ర పోషించిన ‘భూల్‌ భూలయ్య’ చిత్రం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం వారిద్దరూ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. విద్యాబాలన్‌ మాట్లాడుతూ ‘‘భూల్‌ భూలయ్య 3’ చిత్రంతో రెండింతల వినోదం ఖాయం. అన్ని అంశాలు అద్బుతంగా కుదిరాయి. హారర్‌, కామెడీ, థ్రిల్‌, సంగీతం... ఒకటేమిటీ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కార్తిక్‌ ఆర్యన్‌, నేను ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు కడుపుబ్బా నవ్విస్తాం. దీపావళికి మా సినిమా ప్రేక్షకులకు మంచి మజా ఇస్తుంది’ అన్నారు. కార్తీక్‌ ఆర్యన్‌ మాట్లాడుతూ ‘వృత్తిపట్ల అంకిత భావం ఉన్న గొప్ప నటి విద్యాబాలన్‌. బయటే కాదు షూటింగ్‌లోనూ ఆమె సరదాగా ఉంటారు. తనతో కలసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ‘భూల్‌ భూలయ్య 2’తో పోల్చితే మూడో పార్ట్‌లో మరింత వినోదం ఉంటుంది. కథతో పాటు పాత్రల విషయంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే మరిన్ని మార్పులు చేశాం’ అన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 06:24 AM