తెలంగాణ పల్లె కథ
ABN, Publish Date - Oct 20 , 2024 | 02:06 AM
రాకింగ్ రాకేశ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్), అనన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, ధన్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు. గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. శనివారం చిత్రబృందం...
రాకింగ్ రాకేశ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్), అనన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, ధన్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు. గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. శనివారం చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు సాయిరాజేశ్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయిరాజేశ్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బావుంది. ఈ సినిమాతో రాకేశ్ మంచి స్థాయికి వెళ్లాలి. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని అద్భుతంగా చూపించిన ఈ చిత్రాన్ని ఆదరించండి’ అని ప్రేక్షకులను కోరారు. రాకింగ్ రాకేశ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాను మూడు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించాలనేది నా కోరిక. మా దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. చరణ్ అర్జున్ మంచి సంగీతం అందించారు’ అని చెప్పారు. అంజి మాట్లాడుతూ ‘దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా నేనే చేశాను. సాయి రాజేశ్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరోయిన్ అనన్య అద్భుతంగా నటించారు’ అని చెప్పారు.