తెలంగాణ సంప్రదాయ నేపథ్యం

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:49 AM

సుమన్‌, మురళీగౌడ్‌, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు పోషించిన ‘మన కుటుంబం’ చిత్రం ఆడియోను సోమవారం విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఆకుల రాఘవ దర్శకుడు...

సుమన్‌, మురళీగౌడ్‌, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు పోషించిన ‘మన కుటుంబం’ చిత్రం ఆడియోను సోమవారం విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఆకుల రాఘవ దర్శకుడు. ఆడియో వేడుకలో సుమన్‌, మురళీగౌడ్‌, సంగీత దర్శకుడు భానుప్రసాద్‌, దర్శకుడు రాఘవ తదితరులు పాల్గొన్నారు. అనుబంధాలు, ఆత్మీయతలు, తెలంగాణ సాంప్రదాయలు కలబోసి చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత హేమలత తెలిపారు.

Updated Date - Nov 26 , 2024 | 03:49 AM