టైటిల్‌ లోగో ఆవిష్కరించిన తేజ

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:13 AM

దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ చిత్రం టైటిల్‌ లోగోని దర్శకుడు తేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాకైనా...

టైటిల్‌ లోగో ఆవిష్కరించిన తేజ

దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ చిత్రం టైటిల్‌ లోగోని దర్శకుడు తేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాకైనా ప్రేక్షకుల్ని ఆకర్షించేది, వారిని థియేటర్‌ దగ్గరకు నడిచేలా చేసేది టైటిల్‌ మాత్రమే. ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ శక్తిమంతమైన మాస్‌ టైటిల్‌. నిర్మాతకు విజయం చేకూరాలి’ అన్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్‌ పూర్తి చేశామనీ, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందనీ నిర్మాత బెల్లి జనార్థన్‌, దర్శకుడు బాబ్జీ చెప్పారు. సన్నీ అఖిల్‌, అజయ్‌ ఘోష్‌, రవి కాలే, శుభలేఖ సుధాకర్‌, షియాజీ షిండే, హిమజ, జయవాహినీ, తులసి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గజ్వేల్‌ వేణు, ఫొటోగ్రఫీ: నళినీకాంత్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎన్‌.పి. సుబ్బారాయుడు.

Updated Date - Jun 19 , 2024 | 04:13 AM