టీనేజ్‌ లవ్‌ స్టోరీ

ABN , Publish Date - Feb 18 , 2024 | 02:59 AM

ఉదయ్‌రాజ్‌, వైష్ణవి సింగ్‌ జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ‘మధురం2. రాజేశ్‌ చికిలే దర్శకత్వంలో యం. బంగార్రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది...

టీనేజ్‌ లవ్‌ స్టోరీ

ఉదయ్‌రాజ్‌, వైష్ణవి సింగ్‌ జంటగా రూపుదిద్దుకున్న చిత్రం ‘మధురం2. రాజేశ్‌ చికిలే దర్శకత్వంలో యం. బంగార్రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. దర్శకుడు చిత్రం గురించి వివరిస్తూ ‘1990 నేపథ్యంలో జరిగే టీనేజ్‌ లవ్‌స్టోరీ ఇది. అప్పటి స్కూల్‌ వాతావరణం, ఆటలు, అల్లర్లు, ఎలా ఉండేవో చూసిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పారు. నిర్మాత బంగార్రాజు మాట్లాడుతూ ‘కొత్తదనం ఉన్న కథల్ని ప్రేక్షకులు ఎప్పడూ ఆదరిస్తారు. మా సినిమా కూడా కొత్తగా, నేటి తరానికి కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుంది. హైదరాబాద్‌, పాలకొల్లు, ఆచంట, సిద్ధాంతం, రావులపాలెం , కోనసీమ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చెప్పారు.

Updated Date - Feb 18 , 2024 | 03:09 AM